Uttam Kumar: తొందరపడి బయట అమ్ముకొని నష్టపోవద్దు...! 19 d ago
TG : జనవరి 10 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు తొందరపడి బయట అమ్ముకొని నష్టపోవద్దని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33,15,426 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా 4,68,874 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లతో నిజామాబాద్ ముందు స్ధానంలో ఉంది. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు రూ.6.347.40కోట్లు చెల్లించినట్లు, రూ.1,344 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.